తిరుపతి రూరల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏడు టన్నుల విభూది వినాయకుడు
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ పరిధిలోని తుమ్మలగుంటలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానికంగా ఏడు టన్నుల పవిత్ర విభూదితో ఏర్పాటు చేసిన మహా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీశైలం, మహానంది శైవ క్షేత్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన విభూదితో పదకొండడుగుల ఎత్తు, ఏడడుగుల వెడల్పుతో ఈ రూపం తీర్చిదిద్దారు. హైదరాబాద్ సినీ ఆర్ట్ ఆర్కిటెక్ట్ రామస్వామి ఆధ్వర్యంలో పదహారు మంది కళాకారులు ఏడు రోజుల పాటు శ్రమించి ఈ అద్భుత విగ్రహాన్ని రూపొందించారు. ఈ పవిత్ర విగ్రహాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.