బెల్లంపల్లిలో ఘనంగా గణేష్ శోభాయాత్ర.. మార్కెట్ ఏరియాలో సందడి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి 18వ వార్డులో ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండల్ ఆధ్వర్యంలో విగ్రహ ఊరేగింపు ఘనంగా జరిగింది. భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్కెట్ ఏరియాను మార్మోగించారు.

ఈ సందర్భంగా గణేష్ మండల్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.