చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నేతన్న భరోసా నిబంధనలు సడలింపు
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న భరోసా పింఛన్ దరఖాస్తులో బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాలనే నిబంధనను పూర్తిగా తొలగించింది. మాస్టర్ వీవర్స్ ఇచ్చే ధ్రువీకరణ పత్రం, వేతన వివరాలు ఇస్తే సరిపోతుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పింఛన్ అందిస్తామని తెలిపారు.