పీస్ సెంటర్ లాస్ ఏంజిల్స్ చైర్మన్గా విజయ్ పాటిల్ ఎన్నిక

రిపోర్టర్: నరేష్ స్థలం: లాస్ ఏంజిల్స్

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా పనిచేస్తున్న పీస్ సెంటర్ బోర్డు చైర్మన్గా విజయ్ పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని సంస్థ నిర్వాహకులు తెలిపారు. వివిధ కమ్యూనిటీల మధ్య శాంతి, పరస్పర అవగాహనను పెంపొందించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అహింసను, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించేందుకు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలు ఒకరితో ఒకరు మమేకమయ్యేలా తగిన వేదికలను ఏర్పాటు చేస్తామని విజయ్ పాటిల్ వెల్లడించారు.