చేనేత పింఛన్ దరఖాస్తులో కీలక నిబంధన సడలింపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నేతన్న భరోసా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇకపై బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. దీనికి బదులుగా మాస్టర్ వీవర్ ఇచ్చే ధ్రువీకరణ పత్రం, వేతన వివరాల పత్రం ఇస్తే సరిపోతుందని తెలిపారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి నేతన్నకు పింఛన్ అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.