ఎల్లమ్మ ఆలయ ప్రహరీ నిర్మాణానికి యాదవ సంఘం నాయకుడి విరాళం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముదినేపల్లి
రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముదినేపల్లి గ్రామంలో శ్రీ బండపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనుల నిమిత్తం యాదవ సంఘం సేవా సమితి కువైట్-ఇండియా అధ్యక్షుడు గౌసల్ల కంచు రామకృష్ణ రూ.50 వేల ఆర్థిక సరాన్ని అందజేశారు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులకు విరాళపు చెక్కును అందజేయగా స్థానికులు అభినందించారు.