సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

రిపోర్టర్: సతీష్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఅండ్పీఆర్ ఏపీ వెల్లడించిన వివరాల ప్రకారం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపానెల్ మెంట్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ఏర్పాటు, వెరిఫికేషన్ ప్రక్రియ, అధికారిక ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. వివిధ కేటగిరీల వార సేవలను ప్రభుత్వ ప్రచారంలో వినియోగించుకోనున్నారు.