నెల్లూరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్: ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు కార్పొరేషన్ తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఆదివారం జరగనుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వారు పేర్కొన్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలలో శనివారం ఉదయం నుంచి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణ సామగ్రిని అందజేశారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.