ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచిన ఎన్నికల సంఘం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక సవరణ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించినట్లు అధికారులు తెలిపారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార గడువును అక్టోబర్ పదవ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ పదహారున అధికారికంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ పూర్తి వివరాలను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు రాతపూర్వకంగా తెలియజేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది.