మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ: అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను, పోలీస్ బందోబస్తును, స్ట్రాంగ్ రూమ్ల భద్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.