మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత నియామకం: జీవో జారీ
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత కోట అలియాస్ స్వాతి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా జీవో జారీ చేసిందని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వేధింపులను ఎదుర్కొన్న స్వాతి రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా నిలబడి పోరాడారు. ఆమె చూపిన ధైర్యం, నిబద్ధతను గుర్తించిన సీఎం చంద్రబాబు తాజాగా ఆమెకు ఈ పదవిని కట్టబెట్టారు.