రెండు లక్షల కిలోమీటర్ల సైకిల్ రైడ్ పూర్తి చేసిన సుబ్బయ్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుంటూరు
గుంటూరుకు చెందిన ప్రముఖ సైక్లిస్ట్ బండ్లమూడి సుబ్బయ్య అరుదైన ఘనత సాధించారు. వయసు రీత్యా ఆరో ఏట సైక్లింగ్ మొదలుపెట్టిన ఆయన, కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే రెండు లక్షల కిలోమీటర్ల సైకిల్ రైడ్ క్లబ్లో స్థానం సంపాదించుకున్నారు. రోజూ తెల్లవారుజామున వంద కిలోమీటర్లు తొక్కుతూ నిత్యకృత్యంగా మార్చుకున్న ఆయన, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పదిహేను సుదీర్ఘ యాత్రలు పూర్తి చేశారు. ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న ఆయనను పలువురు స్థానిక సైక్లిస్ట్‌లు ఘనంగా అభినందించారు.