భారత సైన్య చరిత్రలో నూతన అధ్యాయం.. రాష్ట్రపతి ఏడీసీగా మేజర్ నవ్య షెకావత్!

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆర్మీ తరఫున తొలి మహిళా ఏడీసీగా మేజర్ నవ్య షెకావత్ నియమితులయ్యారు. త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతికి ఐదుగురు ఏడీసీలు ఉండగా, ఆర్మీ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. 2021లో కమిషన్ పొందిన నవ్య, సీడీఎస్ పరీక్ష ద్వారా సైన్యంలో చేరారు. ఈ నియామకం దేశ మహిళా శక్తికి గొప్ప నిదర్శనంగా నిలిచింది.