గిరిజన ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం: పెట్రాయి నుండి ఒరిస్సా బోర్డర్ వరకు పనులు వేగవంతం చేయాలి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

జీకే వీధి మండలం దారకొండ పంచాయతీకి చెందిన పెట్రయి నుంచి ఒరిస్సా బోర్డర్ వరకు ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.