వైద్య పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి వసూళ్లు: నెల్లూరులో దారుణం
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి అధికారులు బలవంతంగా నగదు వసూలు చేయడం కలకలం రేపింది. ఎగ్జామినర్లకు ప్రత్యేక వసతుల పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రెండు వేల ఏడు వందల రూపాయల చొప్పున వసూలు చేశారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఫిర్యాదు అందడంతో ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ పూర్తి చేసి నివేదికను పంపినట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి వెల్లడించారు.