టీచర్లపై దాడులు చేస్తే సహించేది లేదంటూ భాజపా నేత మాధవ్ హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: బాపట్ల
డీఎస్సీ నియామకాలపై వైకాపా నేతలు కుట్రపూరిత ఆరోపణలు చేస్తూ టీచర్లపై దాడికి పాల్పడటం అమానుషమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. బాపట్ల జిల్లా చీరాలలో విలేకర్లతో మాట్లాడిన ఆయన, ఉపాధ్యాయులను అడ్డుకునే రౌడీమూకలను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. అక్రమాలు జరిగాయని భావిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.