వెంకటాచలం పాఠశాల ఎన్నికల రద్దుపై మందల వెంకటశేషయ్య తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల రద్దు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య మండిపడ్డారు. ఉదయం నుంచి నిబంధనల ప్రకారం నిర్వహించిన ఎన్నికల్లో తమ మద్దతుదారులు పది స్థానాలు గెలుచుకున్నారని తెలిపారు. అయితే ఓటమి భయంతో అధికారులు కోరం లేదనే నెపంతో చివరి నిమిషంలో ఎన్నికలను రద్దు చేయడం దుర్మార్గమని విమర్శించారు.