ధరణి లోపాలతోనే రాష్ట్రంలో వందలాది మంది రైతుల ఆత్మహత్యలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
ధరణి పోర్టల్ లోపాలతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు. కోట్ల మంది రైతుల భూ రికార్డులను విదేశీ సంస్థ టెరాసిస్ చేతిలో పెట్టి భద్రతా లోపాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విదేశీ సంస్థను తొలగించి, ఎన్ఐసికి ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు.