మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని భాషాభిమానుల పిలుపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
పాఠశాల విద్యార్థులు మాతృభాష తెలుగును స్పష్టంగా చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, భాష పరిరక్షణకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని పలువురు భాషాభిమానులు పిలుపునిచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఛైర్మన్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జూమ్ సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం ముప్పై గంటల్లోనే తెలుగు రాయడం, చదవడం నేర్పించే కొత్త విధానంపై చర్చించారు. ఒంగోలులో డిసెంబర్ ఐదు, ఆరు తేదీల్లో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.