తెలంగాణ గురుకులాల్లో దుర్భర పరిస్థితులు: హరీష్ రావు తీవ్ర విమర్శలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Telangana

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు లేవని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. విద్యార్థులకు యూనిఫాంలు, సాక్సులు, బెల్టులు, కనీసం తాగునీరు కూడా అందించడం లేదని ఆరోపించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో విద్యార్థులు ప్రాణ భయంతో చదువుకుంటున్నారని, ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం, సొంత రాష్ట్రంలోని పాఠశాలల దుస్థితిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.