అల్వాల్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, 8 మంది అరెస్ట్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికపై నిందితులు మత్తు పదార్థాలు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వరుణ్, నిక్కీ, నీరజ్, నిఖిల్, గణేష్, సంజయ్ కుమార్, చైతన్య, రాజుతో సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.