ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా నీరు చేరిక: ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
రిపోర్టర్: గోపి
స్థలం: Delhi
ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. టెర్మినల్ లోపలికి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు సామానుతో నానా అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించక 9 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్‌లకు దారి మళ్లించారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో ఇలాంటి దుస్థితి ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.