తిరుమలలో రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో అక్టోబర్ 1 మరియు అక్టోబర్ 5 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని, మిగిలిన సిఫార్సు లేఖలను ఆ రోజుల్లో స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.