కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటకలోని బీదర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు నగరాల వారీగా వేర్వేరు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. జాతీయ స్థాయిలో ఒకలా, హైదరాబాద్ లో మరోలా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ నీతిని బట్టబయలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.