నటి వర్షిణిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తమిళనాడు

తమిళ బిగ్బాస్ ఫేమ్, నటి వర్షిణి వెంకట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ఫిల్మ్ నిర్మిస్తానంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి ఐదు లక్షలు తీసుకుని, డబ్బులు తిరిగి అడిగిన బాధితుడిపై ఆమె దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా రెండు సెల్ఫోన్లు, యాభై వేల నగదు లాక్కుని, మరో ఇరవై ఏడు లక్షలు ఇవ్వకపోతే అబద్ధపు కేసు పెడతానని బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వర్షిణితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.