స్పీకర్‌పై దూషణలు: కేసీఆర్ వెంటనే తాతా మధును సస్పెండ్ చేయాలి

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ వద్ద బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసభ్యకర పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. దళితులు, మహిళల పట్ల బీఆర్ఎస్‌కు గౌరవం ఉంటే తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.