స్థానిక ప్రకటనలపై సర్కార్ కొరడా: నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

తెలంగాణలో తాత్కాలిక అలాగే స్థానిక ప్రకటనల ప్రదర్శన కోసం ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చిందని అధికారులు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వార్డుకు నోడల్ అధికారిని కేటాయించి స్థలాలను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రకటనలు వేయాలనుకునే వ్యాపారులు మైక్యూఆర్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలపై అంటిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.