కార్మిక హక్కుల పరిరక్షణకు మోత్కూరులో సమరశంఖం పూరించిన ఏఐటీయూసీ
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
మోత్కూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ్య జెండా ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా ఉండి అన్యాయాలను ఎదిరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.