న్యాయమూర్తులకు తీపి కబురు: పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్ జారీ

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణలో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును అరవై ఒకటి నుంచి అరవై రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు హైకోర్టు సిఫార్సుల మేరకు ఈ ఆర్డినెన్స్ జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా అర్హులైన న్యాయాధికారులు మరో ఏడాది పాటు తమ విధుల్ లో కొనసాగేందుకు అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు.