కేసీఆర్ హయాంలో ఇచ్చిన దానిలో సగం కరెంటు కూడా ఇవ్వట్లేదు: హరీష్ రావు
రిపోర్టర్: రమేష్
స్థలం: సిద్దిపేట
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇరవై రెండు గంటలు విద్యుత్ వస్తేనే విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు, నేడు సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న ఎనిమిది వందల మెగావాట్ల కరెంటును కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్నారని హరీష్ రావు ఆఫీస్ వెల్లడించారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు సరిపడా విద్యుత్ అందడం లేదని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.