హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణ హత్య, కలకలం రేపిన వీడియో
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని నాగోల్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్‌ను ప్రత్యర్థులు వెంటాడి హత్య చేశారు. బండ్లగూడలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెటిల్మెంట్ల వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు ఉమామహేశ్వర్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.