బెల్లంపల్లి పట్టణంలో అరుదైన బ్రహ్మకమలం పూత.. భక్తిశ్రద్ధలతో తిలకించిన స్థానికులు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీలో అరుదైన బ్రహ్మకమలం విరబూసి స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. కన్నాలబస్తీకి చెందిన లావణ్య రమేష్ దంపతుల ఇంటి ఆవరణలోని పూలకుండీలో ఈ అద్భుత పుష్పం రాత్రి సమయంలో వికసించింది. హిమాలయ ప్రాంతాల్లో కనిపించే ఈ పవిత్ర పుష్పం రాత్రివేళ వికసించి కొద్దిసేపటికే వాడిపోవడం విశేషం. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు కాలనీవాసులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఇంట్లో ఈ పుష్పం పూయడం శుభసూచకంగా భావిస్తున్నామని యజమానులు తెలిపారు.