తిరుచానూరులో కలకలం: మావటిపై విచక్షణారహితంగా దాడి చేసిన పద్మావతి ఆలయ ఏనుగు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుచానూరు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ గజశాలలో ఏనుగు శ్రీనిధి హార్మోన్ల మార్పుల కారణంగా మావటి చంద్రశేఖర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు గోశాల అధికారులు తెలిపారు. ఏనుగును నియంత్రించేందుకు అంకుశం వాడటంతో శ్రీనిధి రెచ్చిపోయిందని, తోటి మావటి చిన్నప్పరెడ్డి సాహసంతో గొలుసులు వేసి ప్రమాదాన్ని తప్పించారని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని, ఏనుగును వారం రోజుల పాటు మనుషులకు దూరంగా ఉంచాలని వైద్యులు సూచించారు.