సోషల్ మీడియా అసత్య ప్రచారంపై ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి క్లారిటీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అడ్డతీగల
అడ్డతీగల సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గట్టి కౌంటర్ ఇచ్చారు. వీడియోలోని కొన్ని భాగాలను మాత్రమే దురుద్దేశపూర్వకంగా వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయాణంలో కార్యకర్తలే కీలకమని, వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన మాటల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని ఎమ్మెల్యే శిరీష దేవి విజ్ఞప్తి చేశారు.