వనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న మంత్రి పొంగులేటి
రిపోర్టర్: అశోక్
స్థలం: వనపర్తి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వనపర్తి జిల్లాలో అధికారికంగా పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన నూతన తెలంగాణ పబ్లిక్ స్కూల్ మరియు బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమీక్ష నిర్వహించి తగు దిశానిర్దేశం చేయనున్నారు.