పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ సాయుధ దళాలకు కోడ్ 100 అలర్ట్
రిపోర్టర్: రాము
స్థలం: ఇరాన్
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన సాయుధ దళాలకు అత్యున్నత స్థాయి సైనిక సన్నద్ధతగా భావించే కోడ్ 100 అలర్ట్‌ను జారీ చేసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను కుదించుకుని వైట్‌హౌస్‌కు తిరిగిరావడం, ఇరాన్ ఈ అలర్ట్ జారీ చేయడం దాదాపు ఒకేసారి జరగడంతో పశ్చిమాసియాలో భీకరదాడులు జరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.