బెంగళూరు ముంబై వందే భారత్ రైలు ప్రకటనపై ప్రయాణికుల ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరు మరియు ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రకటన వచ్చి ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని వివిధ ప్రయాణ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉద్యాన్ ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రయాణికులకు దిక్కైందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త రైలును అందుబాటులోకి తేవాలని బీజేపీ నాయకుడు భరత్ జైన్ డిమాండ్ చేశారు.