ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఏడాది చిన్నారిని కాపాడాలంటూ వేడుకోలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెనుమూరు
చిత్తూరు జిల్లా పెనుమురు మండలం జెట్టిగుండ్లపల్లి హరిజనవాడకు చెందిన ఏడాది బాలుడు కె జతిన్ క్రానిక్ గ్రాన్యులోమాటస్ డిసీజ్ అనే అరుదైన రోగనిరోధక లోప వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు పదిహేను లక్షల రూపాయలు అవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు దాతల సహకారం కోరుతున్నారు.