వైఎస్సార్ కడప జిల్లాలో ఎడారిలా మారిన గండికోట జలాశయం
రిపోర్టర్: విజయ్
స్థలం: వైఎస్సార్ కడప జిల్లా
వర్షాలు లేకపోవడం మరియు తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. గతంలో జలాశయ వెనుక జలాలతో కళకళలాడిన కొండాపురం-పి.అనంతపురం శివారు ప్రాంతాలు నేడు నీరు ఇంకిపోయి ఎడారిలా మారిపోయాయి.