ఆర్యవైశ్య సంఘం అన్నదానం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
అమావాస్య సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ప్రతి అమావాస్యకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని సంఘం అధ్యక్షుడు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేయగా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.