కండీషన్ బెయిల్ పై ఉన్న జగన్ నిబంధనల గురించి మాట్లాడటం విచిత్రం: వర్ల రామయ్య

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

బెయిల్ పై బయటకొచ్చిన వైకాపా అధినేత జగన్ కండీషన్లు గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందులలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జగన్ స్వయంగా నిందితుడని, ప్రజాస్వామ్యంపై గౌరవం లేక రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తిరస్కరించి వెనక్ కి వచ్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.