ఝార్ఖండ్‌లో విషాదం నదిలో నిమజ్జనం చేస్తుండగా ఐదుగురు మృతి
రిపోర్టర్: శివ
స్థలం: ఝార్ఖండ్
ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఆదివాసీ సంప్రదాయ వేడుకల్లో భాగంగా పూజించిన చెట్టుకొమ్మను నదిలో నిమజ్జనం చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక జాలర్లు నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉండటంతో ఒకే కుటుంబంలో, స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.