పీఎం సూర్య ఘర్ పథకంపై గంగాధర నెల్లూరులో ప్రత్యేక అవగాహన సదస్సు
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
గంగాధర నెల్లూరు విద్యుత్ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోలార్ ప్యానెల్స్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. ఈ సదస్సులో భాగంగా ఇరవై ఐదు మంది వినియోగదారులు సోలార్ విద్యుత్ కోసం నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ శేషాద్రి రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.