బియ్యం వినియోగదారులకు భారీ ఊరట: గరిష్ట ధరలు నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టిందని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించడం మరియు తూకాల్ లో మోసాలకు పాల్పడే వ్యాపారులపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉంచేందుకు బీపీటీ కిలో రూ.66, సోనా కిలో రూ.74 మరియు హెచ్ఎంటీ కిలో రూ.79 చొప్పున గరిష్ట ధరలను ప్రభుత్వం ఖరారు చేసిందని వెల్లడించారు.