తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతానికి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 29 లేదా 30వ తేదీల్లో తీవ్ర తుఫాన్గా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.