షాకింగ్ ఘటన: జంతువుల ఎముకలతో కల్తీ నూనె దందా గుట్టురట్టు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బోధన్

బోధన్ పట్టణంలో జంతువుల ఎముకలు, మాంసంతో కల్తీ నూనె తయారు చేస్తున్న భయానక దందాను స్థానిక పోలీసులు గుట్టురట్టు చేశారని అధికారులు తెలిపారు. గాంధీనగర్ ప్రాంతంలోని సఫియుద్దీన్ నివాసంలో సోదాలు నిర్వహించి సుమారు 900 లీటర్ల విషపూరిత కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ చీతా ఫోర్స్ బృందం స్పష్టం చేసింది. ఈ కల్తీ నూనెను రసాయనాలు కలిపి మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాలకు విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.