హైవేపై లారీ బీభత్సం: కాంక్రీట్ మిల్లర్ ఊడిపడి వ్యక్తి దుర్మరణం

రిపోర్టర్: సతీష్ స్థలం: కథలాపూర్

కథలాపూర్ మండలం గంభీర్ పూర్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెద్దకాపు అశోక్ మృతి చెందినట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. బొమ్మెన నుంచి మోత్కూరు రావుపేటకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన టాటా ఇంట్రా వాహనానికి అమర్చిన కాంక్రీట్ మిల్లర్ ఊడిపోయి అశోక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుడి తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు డ్రైవర్ మాలకొండయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.