కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కేరళ

కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కైపమంగళం వద్ద అతివేగంతో వచ్చిన కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడంతో విద్యార్థులంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. గురువయూర్ నుంచి కొడుంగల్లూర్ వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.