పెద్దపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రిపోర్టర్: రమేష్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి హత్య కేసు మిస్టరీని పోలీసులు వీడగొట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ మైనింగ్ చదువుతున్న అక్షితారాణిని లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్ ప్రేమ పేరుతో మోసం చేసి, బలవంతంగా పురుగుమందు తాగించి హత్య చేసినట్లు తేలింది. అలాగే గనిలో శిక్షణ సమయంలో సూపర్ వైజర్ బొమ్మకంటి రవికుమార్ ఆమెపై అత్యాచారం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు నవీన్ కుమార్, రవికుమార్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు.