విశాఖలో కలకలం: అరెస్ట్ అయిన నకిలీ కరెన్సీ ముఠా

రిపోర్టర్: సునీల్ స్థలం: Visakhapatnam

మున్సిపల్ ఎన్నికల వేళ విశాఖపట్నంలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం రేపింది. ఒక హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు, రూ.66 లక్షల విలువైన కలర్ జిరాక్స్ నకిలీ నోట్లు మరియు ఒక డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు విశాఖ పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వీటిని చలామణి చేసే యోచనలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.